నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని గోరిగడ్డ తండాలో సర్పంచ్ లావుడ్య అంబిక లాలు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో తాగునీటి సమస్యలు, పశుగ్రాసం, జల సంరక్షణతో పాటు వీబీజీ రాంజీ పథకంలో కొత్త జాబ్ కార్డుల జారీ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావుడ్య అంబిక లాలు మాట్లాడుతూ... గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ జల సంరక్షణకు సహకరించాలని కోరారు. పశుగ్రాసం కొరత నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, వీబీజీ రాంజీ పథకం ద్వారా అర్హులైన వారికి కొత్త జాబ్ కార్డులు అందించే అంశంపై చర్చించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శోభా, పంచాయతీ కార్యదర్శి కమ్రుద్దీన్, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంచందర్, అంగన్‌వాడీ టీచర్ ఇంద్రావతి, ఆశా కార్యకర్త లక్ష్మి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.