BREAKING
సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్ కాలనీకి ముంపు తప్పదా? ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'డార్క్ నైట్': ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విశేషాలు

ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్ కాలనీకి ముంపు తప్పదా?

Select Suryaa Now
 ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్  కాలనీకి ముంపు తప్పదా?

తూప్రాన్;తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలోని  దేవీ గార్డెన్స్ పక్కనున్న గాయత్రీ నగర్ కాలనీ ఇరిగేషన్, మున్సిపల్  అధికారుల నిర్వాకం వల్ల రోడ్డు కల్వర్టులు అక్రమణకు గురై చెరువు నీటి ప్రవాహానికి అడ్డు కట్టలు పడ్డాయి. ఇపుడు కల్వర్టులకు అనుకొని యాదేచ్చగా  నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు.ఓ రియల్టర్  కల్వర్టు పక్కనే స్థలాన్ని కొనుగోలు చేసి కల్వర్టు నుంచి  చెరువు నీళ్లు బయటకు ప్రవహించకుండా అడ్డుగా రాతి గోడలు కట్టేశాడు. ఆ స్థలాన్ని ఇపుడు సూపర్ మార్కెట్ కోసం లీజుకు ఇవ్వగా  కల్వర్టు కు అనుకోని నిర్మాణాలు  అడ్డూ అదుపులేకుండా జరిగిపోతున్నాయి.అడిగేవారు, అడ్డుకునేవారు లేక యాడేచ్చగా  కట్టడం పనులు జరిగిపోతున్నాయి. కల్వర్టుల దగ్గర నీటి ప్రవాహానికి   స్థలాన్ని వదలకుండా నిర్మాణాలు జరుగుతుండడంతో భవిష్యత్తులో 8వ వార్డులోని  గాయత్రీ నగర్ కాలనీ శాశ్వతంగా  ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా నీటి ప్రవాహానికి  నర్సాపూర్ రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదామూ ఉంది. గాయత్రీ నగర్ కాలనీ వాసులకు వానాకాలం వస్తుందంటే వణుకుతున్నారు. రెండుమూడు  సార్లు వరదలకు కాలనీ ఇండ్లు నీట మునిగాయి. కాలనీ వాసులు  కల్వర్థులకు అడ్డుగా ఉన్న కట్టడా లను  తొలగించి ముంపు నుంచి కాలనీని కాపాడాలని ఎన్ని సార్లు అధికారులతో  మొత్తుకుంటున్నా  శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోకుండా రియల్టర్ కే మద్దతిస్తున్నారని కాలనీ వాసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గాయత్రీ నగర్ కాలనీకి  పైభాగంలో ఉన్న   కొత్త చెరువు నుంచి వచ్ఛే వరద నీళ్లు   ప్రవహించడానికి  రోడ్డు పై ఉన్న 3 కల్వర్థులు రియల్టర్ల చర్యలు వల్ల   మూసుకపోయాయి  వానాకాలం  వస్తే రావెల్లి, పోతరాజుపల్లి చెరువుల మీదుగా వరద నీళ్లు వచ్చి కొత్త చెరువు నిండి వరద నీళ్లు కిందకు తూప్రాన్  పెద్ద చెరువులోకి  ప్రవహించాడానికి కల్వర్థుల దగ్గర దారులు  మూసుకుపోయాయి. దీనివల్ల కాలనీ ముంపునకు గురవుతోంది.వరద తాకిడికి బిటీ రోడ్డు సైతం కొట్టుకుపోయింది. కల్వర్థుల దగ్గర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలనీ వాసులు ఆందోళనలు చేసినా, మెయిన్ రోడ్డు కొట్టుకుపోయినా  ఇరిగేషన్ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ  గట్టి చర్యలు తీసుకోవడంలేదు. కల్వర్థులకు అనుకోని జరుగుతున్న నిర్మాణాలపై అసలు పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాలకు  అడ్డుకోవలసిన అధికారులే  అనుమతులు ఇవ్వడంపై అనుమానాలు కలుగుతున్నాయి.  ఈ సమస్యపై రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ నాయకుడు మాణిక్ రావు స్పందించారు. కల్వర్థుల పక్కనే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకుండా అధికారులు మౌనం వహించడం  సహించారానిదని  ఆగ్రహం వెలిబుచ్చారు. కాలనీ మునిగితే అధికారులు పండుగ చేసుకుంటారా, కల్వర్థుల దగ్గర కాలువలకు స్థలాన్ని వదిలిపెట్టకుండా జరుగుతున్న అక్రమ కట్టడాలను తక్షణమే ఆపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చెప్పడతామని, భవిష్యత్తులో గాయత్రీ నగర్ కాలనీ ముంపునకు గురైతే,గొడవలు జరిగితే   దానికి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులే మున్సిపల్ లో కీలక నేత కూడా పూర్తి బాధ్యత వహించాలని  మానిక్ రావు   హెచ్చరించారు.