telangana
వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోమిన్‌పేట మండల నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షుడిగా అమ్రాది ఖుర్ద్ గ్రామానికి చెందిన దావలిజి గనిమియా, ఉపాధ్యక్షులుగా మురళీధర్ రావు, సురేష్, సలహాదారుగా రాజు కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. నారాయణ, కార్యదర్శిగా బుచ్చిరెడ్డిని నియమించారు.ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు దావలిజి గనిమియా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వికలాంగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, వారి హక్కుల సాధనతో పాటు సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వికలాంగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు. మండలంలోని వికలాంగులందరికీ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మురహరి చారి, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు అనేము, నగేష్, బందయ్య, కిచెన్ నాయక్, గడ్డమీద ప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.