BREAKING
పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్ కాలనీకి ముంపు తప్పదా? ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'డార్క్ నైట్': ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విశేషాలు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలి ఏషియన్ పారా గేమ్స్‌లో భారత్ 114 పతకాల సాధనపై ప్రధాని మోదీ ప్రశంసలు అయినవిల్లి మండలంలో అత్యధిక శాతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.

భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్!

Select Suryaa Now
భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్!

భూభారతి పెండింగ్ దరఖాస్తులు నవంబర్ 15లోగా క్లియర్ చేయాలి.. జీవో 118, 59, 92 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రికార్డుల తారుమారు, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (నవంబర్ 5) : జిల్లాలో భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూభారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సుమారు 22 వేల దరఖాస్తులను నవంబర్ 15లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డితో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూభారతి, జీవో 118, 59, యూఎల్‌సీ, 90-డి, 92 దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 118 దరఖాస్తులను వారం రోజుల్లోగా, జీవో 59, 92 దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. యూఎల్‌సీకి సంబంధించి జీవో 455, 456, 740 కింద ఉన్న మాన్యువల్ దరఖాస్తులను సంబంధిత రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా పరిష్కరించాలని సూచించారు.

భూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, గ్రామసభలకు వారం రోజుల ముందుగానే నోటీసులు జారీ చేయాలని తెలిపారు. అటవీ, రోడ్లు భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూముల వివరాలను సేకరించి, ఆయా శాఖల అధికారుల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించాలని ఆదేశించారు. సంబంధిత అధికారుల అభిప్రాయాలు, సంతకాలను రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

గ్రామసభల నిర్వహణలో నిర్దేశిత ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటించాలని, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. సమావేశాల మినిట్స్‌ను అధికారిక రిజిస్టర్లలో నమోదు చేసి, హాజరైన వారి సంతకాలు తీసుకోవాలన్నారు. రీ-సర్వేకు సంబంధించిన 13 ఫార్మాట్లను సక్రమంగా నిర్వహిస్తూ సర్వే బౌండరీస్ యాక్ట్–1923, తెలంగాణ భూభారతి చట్టం–2024 నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ, రిజర్వ్‌డ్, ఇతర శాఖలకు చెందిన భూముల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసుల జారీ నుంచి సరిహద్దుల నిర్ధారణ, గ్రామసభల మినిట్స్ వరకు అన్ని రికార్డులను భద్రపరచాలన్నారు. తప్పుడు నివేదికలు సమర్పించడం, రికార్డుల తారుమారు, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ కిరణ్మయి, చంద్రారెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాంరెడ్డి, డీఆర్ఓ శారదాదేవి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, యూఎల్‌సీ విభాగం అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, గ్రామపాలన అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.