BREAKING
సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి మెదక్ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు - గాయత్రి నగర్ కాలనీకి ముంపు తప్పదా? ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'డార్క్ నైట్': ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విశేషాలు

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలి

Select Suryaa Now
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలి

ఇంకొల్లు, మేజర్ న్యూస్:

మురసు తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి

ద్రోణాదుల, మార్టూరు, కారంచేడు, చీరాల ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులపై సమీక్ష

మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు APCPDCL అధికారులు, సిబ్బంది చేపడుతున్న పనులను సంస్థ సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో సీఎండీ గారు ద్రోణాదుల వద్ద 33 కేవీ ఇడుపులపాడు–ద్రోణాదుల విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్ మరమ్మతులు, పునరుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం 132 కేవీ మార్టూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించి, అక్కడి నుంచి విద్యుత్ ఫీడర్ల ఛార్జింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భాగంగా ఫీడర్లను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను సమీక్షించారు.

అలాగే 33/11 కేవీ కారంచేడు సబ్‌స్టేషన్ నుంచి 33/11 కేవీ చీరాల దండుబాట సబ్‌స్టేషన్ వరకు ఉన్న 33 కేవీ పర్చూరు ఫీడర్‌కు సంబంధించిన మరమ్మతు (Rectification) పనులను సీఎండీ గారు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అధిగమించి, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎండీ ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందిని అభినందించారు.రసు తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి

ద్రోణాదుల, మార్టూరు, కారంచేడు, చీరాల ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులపై సమీక్ష

మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు APCPDCL అధికారులు, సిబ్బంది చేపడుతున్న పనులను సంస్థ సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో సీఎండీ గారు ద్రోణాదుల వద్ద 33 కేవీ ఇడుపులపాడు–ద్రోణాదుల విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్ మరమ్మతులు, పునరుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం 132 కేవీ మార్టూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించి, అక్కడి నుంచి విద్యుత్ ఫీడర్ల ఛార్జింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భాగంగా ఫీడర్లను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను సమీక్షించారు.

అలాగే 33/11 కేవీ కారంచేడు సబ్‌స్టేషన్ నుంచి 33/11 కేవీ చీరాల దండుబాట సబ్‌స్టేషన్ వరకు ఉన్న 33 కేవీ పర్చూరు ఫీడర్‌కు సంబంధించిన మరమ్మతు (Rectification) పనులను సీఎండీ గారు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అధిగమించి, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎండీ ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందిని అభినందించారు.