పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో 2026 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. నవంబర్ 5వ తేదీ గురువారం ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ముఖ్యంగా వయసు మీదపడినా శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా వీల్‌చైర్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసిన వృద్ధులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంపై వారికున్న నిబద్ధత, ఓటు విలువను చాటిచెప్పింది.మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, పోలీసులు కల్పించిన భద్రత, వైద్య సిబ్బంది అందించిన సేవలు అభినందనీయం. ఎన్నికల అధికారి ఎం. సునీల్ వినయ్, తహసీల్దార్ కె. నిరంజన్, ఎంపీడీవో కేయూఆర్ఎల్ పద్మజ, ఎస్సై వై. సుధాకర్ నాయకత్వంలో అధికారులు, పెరవలి పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు.అయితే ఇన్ని చక్కటి ఏర్పాట్లు చేసినప్పటికీ మండలంలోని చాలా గ్రామాల్లో సుమారు 75 శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే మిగిలిన 25 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
అసలు ఎందుకు వారు ఓటు వేయడానికి రాలేదు? ఓటు విలువ తెలియకనా? సమయం లేకనా? లేక నిర్లక్ష్యమా? అనేది ఆలోచించాల్సిన విషయం.ఏది ఏమైనా, రాబోయే ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారిని కూడా చైతన్యపరిచి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా కృషి చేద్దాం.ఎందుకంటే ఓటు అనేది కేవలం మన హక్కు మాత్రమే కాదు... మన బాధ్యత కూడా!