ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలోని ఎం కోటూరు హైస్కూల్లో జరిగినసాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంకాలం వరకు ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి జగదీశ్వర్ నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి ఎండను కూడా లెక్కచేయకుండా పురుషులు స్త్రీలు క్యూ లైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి జగదీశ్వర్ నాయుడు అక్కడే ఉండి ప్రజలకు ఓటు వేయాలని .అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీరిద్దరూ ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజల వద్ద నుండి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తాము గెలుపొందితే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్