నేడే పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి.
గోపాలపురం మేజర్ న్యూస్ :గోపాలపురం మండలంలో ఈ నెలఆరవ తేదీ శుక్రవారం నాడు జరుగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రిటర్నింగ్ అధికారి.పి భాగ్యవతితెలిపారు.గురువారం ఐదవ తేదీన జరగాల్సిన పోలింగ్ ను భారీ వర్షాల కారణంగా ఒకరోజు వాయిదా వేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన పోలింగ్కు సంబంధించి పోలింగ్ సామాగ్రి సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండలంలో 51 211 మందిఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.వీరిలో 25 065మంది పురుష ఓటర్లు 26143మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారుమండలంలో మొత్తం 64 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 రూట్లు గాను మూడు జోన్లుగా ఏర్పాటు చేసినట్లు ఆర్వో భాగ్యవతి తెలిపారు మండలంలో వేళ్ళ చింతల గూడెం జగన్నాధపురం గ్రామాల తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులుఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన 16 స్థానాలకు జడ్పిటిసి స్థానానికి పోలింగ్ జరగనున్నది మండలంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆర్వో తెలిపారు.