BREAKING
పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం రైతులందరికీ పంట నష్టం అందించాలి కంచన్‌పల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహణ రోమ్‌లో భార్య, కూతురి హత్య కేసు...అమెరికన్ పౌరుడికి జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు పాఠశాలల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచ్ పర్యవేక్షణ నూతన కమిషనర్‌కు డీఎంహెచ్‌ఓ ఆనంద్ అభినందనలు

క్లీన్ స్వీప్ దిశగా కూటమి.. అన్ని స్థానాల్లోనూ విజయం ఖాయం..గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Select Suryaa Now
క్లీన్ స్వీప్ దిశగా కూటమి.. అన్ని స్థానాల్లోనూ విజయం ఖాయం..గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

అనపర్తి, మేజర్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పోలింగ్ సరళిని, ఓటర్ల స్పందనను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. 

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా మారిందని పేర్కొన్నారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు.నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన కూటమి అభ్యర్థులందరూ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూటమికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని, అభివృద్ధి, సంక్షేమమే తమకు ప్రధాన బలమని అన్నారు. 

ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేశారని, ప్రజల్లోకి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం చేసిన ఏర్పాట్లను ఆయన అభినందించారు.ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తుందని, ఫలితాల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.