BREAKING
ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం

భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..!

Select Suryaa Now
భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..!

-అంబాజీపేట మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఇటీవల వచ్చిన తుపాను ప్రభావమేనని తెలుస్తోంది. ఓటర్లలో అనాసక్తి కాదు, పరిస్థితులే వారిని పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నాయి. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు జలమయమయ్యాయి. పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు సహాయక చర్యల్లోనే నిమగ్నమయ్యారు.ఓటు వేయాలన్న ఆసక్తి ఉన్నా, బురద రోడ్లు, తెగిన రాకపోకలు, వర్షపు ముప్పు కారణంగా వృద్ధులు, మహిళలు, దూర ప్రాంతాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. పోల్ మేనేజ్మెంట్ లో లోపం కంటే, ప్రకృతి వైపరీత్యమే ఓటింగ్ ను దెబ్బతీసిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా అయినవిల్లి మండలంలో 69.92 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మలికిపురం లో కేవలం 51.28 శాతం మాత్రమే నమోదైంది. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పోలింగ్ తక్కువగా నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఓటరు ఓడిపోలేదు, తుపాను ముందు ఓటరు నిస్సహాయుడయ్యాడనే మాట ప్రజల నుండి  వినిపిస్తున్నాయి