BREAKING
ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం

ఆలమూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి.

Select Suryaa Now
ఆలమూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి.

                                                 ఆలమూరు మండలంలో 72 శాతం ఓట్లు నమోదు.
ఆలమూరు మేజర్ న్యూస్ :ఆలమూరు మండలంలో ప్రశాంతంగా సాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి. ప్రశాంతి (ఐఏఎస్) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్వో లక్ష్మి ప్రత్యూష, ఏఆర్వోలు ఎంపీడీవో ఏ రాజు, తాసిల్దార్ కే కుశరాజు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలో  ఓట్లు ముగింపు సమయానికి మండల పరిధి 18 గ్రామాల్లోనూ  77 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 72 .29 శాతం ఓట్లు నమోదైనట్లు వారు తెలిపారు.  క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మరియు ఓటింగ్ సరళిని ఆమె నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా  ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి ఆమె పలు కీలక సూచనలు అందజేశారు.మండల వ్యాప్తంగా మొత్తం 77 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రారంభమై, అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం  కాగా  సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని  ఆమె పేర్కొన్నారు ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  రావులపాలెం సీఐ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై నరేష్ భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా  జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు బి అప్పాజీ, ఎన్ రాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.