BREAKING
పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం రైతులందరికీ పంట నష్టం అందించాలి కంచన్‌పల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహణ రోమ్‌లో భార్య, కూతురి హత్య కేసు...అమెరికన్ పౌరుడికి జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు పాఠశాలల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచ్ పర్యవేక్షణ నూతన కమిషనర్‌కు డీఎంహెచ్‌ఓ ఆనంద్ అభినందనలు

స్థానిక ఎన్నికల్లో ముగిసిన తొలి ఘట్టం - బిక్కవోలు మండలంలో 68.99 శాతం పోలింగ్ నమోదు

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో ముగిసిన తొలి ఘట్టం - బిక్కవోలు మండలంలో 68.99 శాతం పోలింగ్ నమోదు

బిక్కవోలు, మేజర్ న్యూస్.: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిక్కవోలు మండల పరిధిలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల పరిధిలో మొత్తం 39,950 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 68.99 శాతం పోలింగ్ నమోదైంది.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యత్మకమైన  ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. ఎన్నికల సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఎక్కడా పెద్దగా ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం విజయవంతంగా పూర్తయింది.