BREAKING
ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం

కంచన్‌పల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహణ

Select Suryaa Now
కంచన్‌పల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహణ

కౌడిపల్లి;కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామంలో గురువారం నాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ (ఎటిఎంఎ) సౌజన్యంతో రైతులకు పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి స్వప్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాహితి, గ్రామ సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పంట కోత అనంతరం రైతులు పాటించాల్సిన పంట కోత అనంతర యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ధాన్యం నాణ్యతను కాపాడేందుకు సరైన సమయంలో కోత చేపట్టడం, ధాన్యాన్ని తగిన విధంగా ఆరబెట్టి సరైన తేమ శాతంతో నిల్వ చేయడం, ధాన్యాన్ని శుభ్రపరచడం, తాలు మరియు ఇతర మలినాలను తొలగించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.అదేవిధంగా వరి పంట అవశేషాలను తగులబెట్టకుండా వాటిని సేంద్రియ ఎరువుగా లేదా పశుగ్రాసంగా వినియోగించుకోవాలని సూచించారు. పంట అవశేషాల నిర్వహణ ద్వారా నేల సారవంతతను పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.రైతులు పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా పాటించడం ద్వారా ధాన్యం నాణ్యతను పెంపొందించుకొని, నిల్వ నష్టాలను తగ్గించుకొని, అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని సూచించారు. ఈ పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించేందుకు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి సాహితి, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.