కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు
సూర్య జగిత్యాల ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సరిత మట్ట ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో కమ్యూనిటీ మీడియేషన్ సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నచిన్న కుటుంబ, సామాజిక మరియు స్థానిక వివాదాలను కోర్టులకు వెళ్లకుండా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. అదేవిధంగా, సీనియర్ సిటిజన్ల హక్కులు, వారి రక్షణ, పోషణ సంక్షేమం కోసం చట్టంలో కల్పించిన నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సి.హెచ్. అనురాధ , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.