పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పెద్ద శంకరంపేట;పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలం గా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పెద్ద శంకరంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.. ప్రభుత్వం వెంటనే పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.. కాంగ్రెస్ పాలనలో రైతులకు వ్యవసాయానికి సరైన కరెంటు ఇవ్వకపోవడంతో రైతులు పంట ఎండిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు డబ్బులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ఆగస్టు నెల నుండి పెద్దశంకరపేట మండలంలో దాదాపు 19 మంది రైతులు మృతి చెందినప్పటికీ వారికి రైతు భీమా డబ్బులు ఐదు లక్షల కూడా చెల్లించ లేదని. ప్రభుత్వం వెంటనే రైతు బీమా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటలో రైతులకు 100% సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందించాలని పేర్కొన్నారు.. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జంగం రాఘవులు సురేష్ గౌడ్ కోణం అంజయ్య. వెంకట్ రెడ్డి మాణిక్ రెడ్డి రవీందర్ లింగయ్య సంగమేశ్వర్ రాములు దుర్గయ్య బేతయ్య మల్లేశం ఆయ గ్రామాల నుండి అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.