రైతులందరికీ పంట నష్టం అందించాలి
అయినవిల్లి మేజర్ న్యూస్ :పంట నష్టం నమోదు కొ రకు రైతులు వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు అయితే వర్షాలు ఎన్నికలు కారణంగా అధికారులు అందుబాటులో ఉండటం లేదని అయినవిల్లి మండల రైతులు ఆరోపిస్తున్నారు ఆర్నా మురసు తుఫాన్లు కారణంగా మెట్ట పల్లం తేడా లేకుండా అన్ని రకాల వ్యవసాయాలు దెబ్బతిన్నాయని అక్కడక్కడ 10. 5 శాతం మిగిలినప్పటికీ రైతుకు ఖర్చులు కూడా రావని రైతులు తెలిపారు ముఖ్యంగా అరటి వరి పంటలు నూటికి నూరు శాతం దెబ్బతిన్నాయి కొబ్బరి చెట్లు కూలిపోవడం పిందులు సైతం రాలి చెట్లు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు కాగా మండలంలో కొన్నిచోట్ల మురుగు దిగే సౌకర్యం లేక వరిపొలాలు వీటిలో కుళ్ళిపోతున్నాయి చిన్న చిన్న బోదులు ఉన్నా అధిక వర్షాల కారణంగా వరి పొలాల చెరువులను తలపిస్తున్నాయి అన్ని రకాల పంటలకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి పంట నమోదు కాలాన్ని పెంచి రైతులకు న్యాయం చేయవలసి ఉంది