telangana
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు
దోమ, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దోమ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ... ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు, మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఇతర అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో తమ అభిప్రాయాలను ఓటు ద్వారా వ్యక్తం చేయాలని ఆయన కోరారు.