బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం
సూర్య మంచిర్యాల: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరిగి గొడవలకు పాల్పడిన యువకుడిపై శ్రీరాంపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు.శ్రీరాంపూర్ ఏరియా అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (19)ను గురువారం మంచిర్యాల ఆర్డీఓ ఎదుట హాజరుపరిచారు.గతంలో నేరాలకు పాల్పడిన నేపథ్యంలో సత్ప్రవర్తనతో ఉండాలని ఆర్డీఓ గూడూరి శ్రీనివాస్ రావు ఎదుట యువకుడిని బైండోవర్ చేశారు.అయినప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరిగి గొడవలకు పాల్పడినట్లు పోలీసుల దృష్టికి రావడంతో శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు.ఈ మేరకు ఆర్డీఓ యువకుడికి నోటీసులు జారీ చేశారు.బైండోవర్ షరతులను ఉల్లంఘించినందుకు గడువులోగా రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.