తొట్టంబేడు మండలంలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 43 పోలింగ్ కేంద్రాల్లో 77.94 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 30,519 మంది ఓటర్లకు గాను 23,807 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుండేలిగుంట, దైనేడు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే ముద్ర విరిగిపోవడంతో సుమారు గంటసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చోడవరం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు పోటీపడటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యాత్మకంగా గుర్తించిన 19 కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్ ప్రసారం ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది, పోలీసుల సమన్వయంతో పోలింగ్ ముగిసింది. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి