BREAKING
భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC) ప్రారంభం: ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లాలో నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా పలు కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి , జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళి, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలీసు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసు సిబ్బందితో మాట్లాడి ఎన్నికల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు ఎన్నికల సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడరాదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 

 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.