గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్
మహారాష్ట్ర :కొల్లాపూర్ జిల్లా గోకుల్ డెయిరీ ఎన్నికల వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీటుగా సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం నిబంధనలను మార్చి మెజారిటీని దొంగిలిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించగా, కేవలం 4,500 మంది ఓటర్లు ఉన్న స్థానిక సహకార అంశంపై ఢిల్లీలో కూర్చుని ట్వీట్లు చేయడం ఏంటని ఫడ్నవీస్ ప్రశ్నించారు.
సహకార సంఘంలో కోరం లేకపోవడం వల్లే పాలకవర్గ సమావేశాలు రెండుసార్లు రద్దయ్యాయని, అడ్వకేట్ జనరల్ చట్టపరమైన సలహా తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని ఆయన వివరించారు. గోకుల్ డెయిరీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదని, నిబంధనలకు లోబడే జరిగిందని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు.