BREAKING
భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC) ప్రారంభం: ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు

Select Suryaa Now
తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తొలి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ (e-Dip) ద్వారా ఎస్ఎస్డీ (SSD) టోకెన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తర్వాతి ఏడు రోజులు పూర్తిస్థాయిలో సర్వదర్శనం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

క్యూలైన్లను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పిస్తామన్నారు. భారీగా రానున్న భక్తుల రద్దీకి అనుగుణంగా పగడ్బందీ భద్రతతో పాటు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీవీఎస్వో తెలిపారు. గత వైకుంఠ ఏకాదశికి రికార్డు స్థాయిలో 7.83 లక్షల మందికి దర్శనం కల్పించిన ఉత్సాహంతో, ఈసారి కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు.