BREAKING
భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC) ప్రారంభం: ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి

నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు

Select Suryaa Now
నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు

శ్రీకాళహస్తి: పోలింగ్ కేంద్రం మార్పు 93 మంది ఓటర్లను జడ్పీటీసీ, ఎంపీటీవీ ఎన్నికల్లో ఓటు హక్కుకు దూరం చేసింది. తొట్టంబేడు మండలం మామిడిగుంట గ్రామానికి చెందిన ఓటర్ల పోలింగ్ కేంద్రాన్ని సాంకేతిక కారణాలతో దైనేడుకు మార్చడంపై గురువారం తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎన్నో ఏళ్లుగా మామిడిగుంటలోనే ఓటు వేస్తున్న తమను అకస్మాత్తుగా దైనేడుకు పంపడంపై ఓటర్లు అభ్యంతరం తెలిపారు. తమ గ్రామంలో 93 మంది ఓటర్లు ఉండగా, కేవలం 33 మంది ఓటర్లున్న దైనేడుకు పోలింగ్ కేంద్రాన్ని మార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాన్ని తిరిగి మామిడిగుంటకు మార్చకుంటే ఓటు వేసేది లేదని భీష్మించారు.
సాంకేతిక లోపం కారణంగానే పోలింగ్ కేంద్రాన్ని దైనేడుకు మార్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోవిందరాజ భాస్కర్ వివరణ ఇచ్చారు. మామిడిగుంట ఓటర్ల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఓటర్లను ఒప్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో ఎన్నికల అధికారులు, స్థానిక నాయకులు విఫలమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్ల కోసం వేచి చూసిన బస్సులు చివరకు ఒక్క ఓటరినీ తీసుకురాకుండానే ఖాళీ సీట్లతో వెనుదిరిగాయి. ఓటర్లకు సౌకర్యాలు కల్పించామని అధికారులు చెబుతున్నా, వారి అభ్యంతరాన్ని పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం విమర్శలకు తావిచ్చింది. పోలింగ్ కేంద్రం మార్పుపై ముందస్తు అవగాహన కల్పించారా? ఓటర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని చెప్పే యంత్రాంగం, 93 మంది ఓటర్లు ఓటు వేయకుండా వెనుదిరిగినా ప్రేక్షకపాత్ర వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి

. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197