BREAKING
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం.

కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

Select Suryaa Now
కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

కుందుర్పి: మండల వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు, ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు ముందస్తుగా తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ ప్రారంభానికి అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.