ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట డివిజన్ పరిధిలో సుమారు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని డిఎస్పీ హెచ్చరించారు.