BREAKING
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం.

ఓటరు తీర్పునకు వేళాయె.. పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Select Suryaa Now
ఓటరు తీర్పునకు వేళాయె.. పోలింగ్‌కు సర్వం సిద్ధం!

                                  ఎన్నికల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

కడియం, మేజర్ న్యూస్,:కడియం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండల పరిధిలోని 22 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన కడియంలోని జీఎన్ఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ, విధుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా, సిబ్బంది సకాలంలో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో ఆర్వో మల్లికార్జున్, ఎంపీడీవో కే. రమేష్, జోనల్ ఆఫీసర్ సుధీర్, తహసీల్దార్ ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికావడంతో కడియం మండలంలో రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఓటరు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.