BREAKING
ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం ఆ పదం నాకు అస్సలు నచ్చదు.. బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా ప్రతినిధిగా గుర్తింపు కోరుకుంటున్న రణ్‌బీర్! నీటి సంరక్షణ పై అవగాహన భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

Select Suryaa Now
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

 

సంగారెడ్డి : డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రముఖ సంస్థ కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ (ఇండియా) లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చివరి సంవత్సరం చదువుతున్న 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు నిర్వహించిన రాత పరీక్షలో 17 మంది విద్యార్థులు తదుపరి దశకు అర్హత సాధించారు. తుది ఎంపిక ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.12 వేల ఉపకార వేతనం అందించడంతో పాటు, శిక్షణ పూర్తయి ఉద్యోగంలో చేరిన అనంతరం ఏడాదికి రూ.2 లక్షల 50 వేల వేతన ప్యాకేజీ అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి. జానకీదేవి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. చి. విద్యాసాగర్, శిక్షణ మరియు ఉద్యోగ నియామకాల అధికారి శ్రీమతి శ్రీలక్ష్మి, అధ్యాపకులు ఉమాశంకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని ప్రిన్సిపాల్ తెలిపారు.