నీటి సంరక్షణ పై అవగాహన
నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి. కోమల మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించడం, నీటి వృథాను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఆరోగ్య సంస్థల్లోని నీటి ట్యాంకులు, శుద్ధి నీటి యంత్రాలు, వాటర్ కూలర్ల శుభ్రత, నిర్వహణను పరిశీలించడంతో పాటు నీటి లీకేజీలను గుర్తించి నివారించేందుకు చర్యలు చేపట్టారు. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించి, సేకరించిన నీటిని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోజువారీ జీవితంలో నీటిని పొదుపుగా వినియోగించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు విలువైన నీటి వనరులను కాపాడవచ్చని డా. పి. కోమల పేర్కొన్నారు.