BREAKING
సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పతకం

జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం

  రేగిడి, సూర్య :  ఎన్నికల ప్రచారంలో చివరి రోజు అయిన మంగళవారం కూటమి తరుపున జనసేన పార్టీ తరపున గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్న రేవతి ఎన్నికల ప్రచారం జన జాతరను తలపించింది. నామినేషన్ వేసినప్పటినుంచి గ్రామాలలో తన భర్త కోట్ల రఘు సహకారంతో రేవతి ఎన్నికల ప్రచారం ఓటర్లను అడుగున ఆకట్టుకుంది. మండలంలోని అన్ని గ్రామాలను చుట్టేయడమే కాకుండా ఇంటింటికి వెళ్లి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానంటూ ప్రచారంలో తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన మంగళవారం బత్తివలస, కుమిలి, రెల్లివలస, కొప్పెర్ల, నడిపల్లి, కోనాడ గ్రామాలలో రేవతి జడ్పిటిసి గా పోటీ చేస్తున్న తనను ఆదరించి జనసేన పార్టీ తరఫున గ్లాస్ గుర్తుపై ఓటు వేస్తే తన స్వగ్రామమైన కొవ్వాడ అగ్రహారంకు చేసిన అభివృద్ధిని, మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు విస్తరిస్తానంటూ ఓటర్లను రేవతి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఓటర్ల విశేషాదరణ వలనతన గెలుపుకు ఎటువంటి ఢోకా లేదని, మెజారిటీయే ఎంత అన్నది ఎన్నికల ఫలితాల్లో  వేచి చూడాల్సి ఉందని జడ్పిటిసి గా జనసేన తరఫున పోటీ చేస్తున్న రేవతి  ధీమా వ్యక్తం చేశారు.