నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక
క్షణికావేశంలో నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ వారికి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి మ సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామని అన్నారు. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు.జైలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ గుణశేఖర్ నాయుడు ,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పవన శేష సాయి,జైలు సిబ్బంది పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్