ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి
ఆర్డీఓ, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
చేవెళ్ల : చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఊరెళ్ల గ్రామకంఠం భూములను సమగ్రంగా సర్వే చేయాలని కోరుతూ మంగళవారం గౌరవనీయులైన ఆర్డీఓ, మండల తహసీల్దార్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. గ్రామకంఠం భూముల సరిహద్దులను గుర్తించి, భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్ దూత మల్లేష్, రెండో వార్డు కౌన్సిలర్ డప్పు సువర్ణ చందు, మాజీ సర్పంచులు శెట్టి రమేష్, అరుణ నర్సింలు, మాజీ ఉపసర్పంచ్ సునిగంటి విట్టలయ్య, తిమ్మారెడ్డిగూడెం రాజు, ఉబ్బటి బీరప్ప, గూడెపు ప్రవీణ్, మహమ్మద్ జావిద్, గారెల కర్ణాకర్ గౌడ్, మహమ్మద్ జాగిర్, మహమ్మద్ సాజిద్, మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.