BREAKING
గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం

Select Suryaa Now
రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం

మెదక్   ; రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యంగా  తాసిల్దారు చిత్తశుద్ధితో పని చేయాలి భూముల రీ సర్వే ప్రక్రియలో  నిర్లక్ష్యాన్ని వీడాలని  జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ తాసిల్దారులను హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో  భూధార్, ల్యాండ్ రీ సర్వే, ధాన్యం కొనుగోలు, త్రిబుల్ ఆర్ , ప్రజావాణి పెండింగ్ సమస్యలు, సంబంధిత రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు తాసిల్దారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ పరమైన అంశాలలో పక్కా ప్రణాళికతో పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. రెవెన్యూ సేవలలో ఆలస్యాన్ని సహించేది లేదని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.. భూముల సమగ్ర రీ-సర్వే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరియు భూ రికార్డుల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను మెదక్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పటిష్టంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. -సర్వే లక్ష్యాలు, ప్రక్రియ, రైతులకు కలిగే ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించి వారి సహకారం పొందాలని సూచించారు.భూ రీ సర్వే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సరిహద్దుల గుర్తింపు జరపాలి. అని చెప్పారు.విధుల్లో నిర్లక్ష్యం వహించే తాసిల్దారుల దగ్గర నుండి  మండల సర్వేయర్లు లేదా లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించారు.
ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూభాగానికి 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అయిన  భూదారి నెంబర్ను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు
రీ-సర్వే ఆధారంగా భూదార్ నెంబర్, ల్యాండ్ బేస్డ్ మ్యాప్  అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఫోర్జరీలకు తావులేకుండా పక్కాగా రికార్డులు రూపొందుతాయని స్పష్టం చేశారు.పెండింగ్ కోర్టు కేసులు - రెవెన్యూ వివాదాలు వివిధ కోర్టుల్లో మరియు ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల కేసులకు సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన రికార్డులతో కౌంటర్ అఫిడవిట్లను సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అటవీ మరియు రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న భూములపై జాయింట్ ఫీల్డ్ సర్వేలు నిర్వహించి, శాస్త్రీయ పద్ధతిలో సరిహద్దులను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న అర్హులైన పేదలకు జీవో 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ  ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిశీలనను క్షుణ్ణంగా పూర్తి చేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిజమైన లబ్ధిదారుల దరఖాస్తులను మాత్రమే ఆమోదించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో తహసీల్దార్లు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, నిర్దేశిత గడువులోగా రీ-సర్వే మరియు రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  సర్వే ద్వారా ప్రతి భూమికి భూదార్ నంబర్ కేటాయించడంతోపాటు ఎల్‌బీఎం ద్వారా భూముల హక్కులు, సరిహద్దులకు స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు. భూములు రి సర్వే జరిగేటప్పుడు తాసిల్దార్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి 
సర్వే టీమ్స్ సర్వే చేస్తున్న విధానాన్ని 
తప్పనిసరిగా పరిశీలించాలని భూముల రీ సర్వే రైతుల సమక్షంలోనే చేపట్టే విధంగా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలనకు వెళ్ళినప్పుడు వెల్దుర్తి మండల  తాసిల్దార్  సర్వే నిర్వహణ తీరు తెలియకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ  చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ ను ఆదేశించారు.సర్వే సెటిల్‌మెంట్‌ తర్వాత భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత... సులభం అవుతాయని చెప్పారు. అంతకుముందు భూధార్ ,రీ సర్వే ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలను వారి మాటలలో స్వయంగా తెలుసుకున్నారు.ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  దరఖాస్తుదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, అనర్హుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు పోకుండా జాగ్రత్త వహించాలని, నివేదికలను త్వరగా సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే భూ సంబంధిత ఫిర్యాదులపై తహసీల్దార్లు తక్షణమే స్పందించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణి పెండింగ్ సమస్యలపై ప్రతిఘటన పరిష్కరించాలన్నారు, త్రిబుల్ ఆర్
సమస్యలపై తాసిల్దార్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ప్రస్తుతం జిల్లాలో 
530 సెంటర్లు ప్రారంభించాల్సి ఉండగా 280 సెంటర్స్ ప్రారంభించామన్నారు 14 సెంటర్ల నుండి 412 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.ల్యాండ్ అక్విజిషన్
లక్ష్యాలను పూర్తి చేయాలి అన్నారుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ ట్రైనీ కలెక్టర్ మహమ్మద్lఅహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ రామకృష్ణ, తూప్రాన్ బావయ్య, సంబంధిత తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.