గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ...
ఫరూఖ్ నగర్ రంగారెడ్డి
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో చిత్ర లేఖన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా “చిత్రధార – గిరిజన ప్రాంతీయ కళల్లో సాంస్కృతిక వారసత్వం” అనే అంశంపై నాలుగు రోజుల చిత్రలేఖన శిక్షణ శిబిరాన్ని మంగళవారం డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నాయక్ పోడ్, కోయ, లంబాడీ, గోండ్ తదితర గిరిజన సంప్రదాయ చిత్రకళలపై నిపుణులు శిక్షణ అందించనున్నారు అని తెేలిపారు.
ఈ కార్యక్రమంలో , డిగ్రీ కళాశాలల ఓఎస్డీలు డాక్టర్ నీరజ , సతీష్ గౌడ్ , రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ రీజియన్ల కోఆర్డినేటర్ నాగార్జున రావు , వరలక్ష్మి డిఎల్, డిపిఓ, ప్రముఖ పెయింటింగ్ నిపుణురాలు కమల కుమారి, షాద్‌నగర్ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీతా పోలే, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కళాజ్యోతి , అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీత పోలే మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. డిగ్రీ కళాశాలల ఓఎస్డీ డాక్టర్ నీరజ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు సంప్రదాయ కళల పట్ల ఆసక్తి, గౌరవం పెంపొందించేందుకు ఈ శిబిరం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నాలుగు రోజుల శిక్షణ ద్వారా విద్యార్థులు గిరిజన కళల ప్రత్యేకతలను తెలుసుకోవడంతో పాటు చిత్రలేఖనంలో నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
నరసింహారెడ్డి మేజర్ న్యూస్…