BREAKING
గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

Select Suryaa Now
భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు  ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

కొల్చారం …భూసారాన్ని కాపాడుకుంటూ పంటల సాగు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి రైతులకు సూచించారు. కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లతా శ్రీశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భూసుపోషణ, భూసంరక్షణపై 'ఖేతీ బచావో అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సూక్ష్మపోషకాలను వినియోగిస్తూ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. తద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం కాపాడబడుతుందని వివరించారు.
అలాగే మట్టి నమూనాల సేకరణ, పరీక్షల విధానం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి, సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూమేష్, రైతులు పాల్గొన్నారు.