అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
పూసపాటిరేగ, సూర్య : పూసపాటి రేగ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎం ఎల్ టి(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సుకు సంబంధించి గెస్ట్ లెక్చరర్ (అతిధి అధ్యాపకులు) పోస్ట్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ (మైక్రో బయాలజీ), ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ), బి ఫార్మసీ, బీఎస్సీ (ఎం ఎల్ టి) ఎంబీబీఎస్, బిహెచ్ఎంఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ మొయిద హనుమంతరావు తెలిపారు. సదరు దరఖాస్తులను పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వారి కార్యాలయానికి ఈ నెల 7 తేదీ చివరి గడువుగా పేర్కొన్నారు. ఆరోజు సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలన్నారు. అర్హులైన వారికి ఇంటర్వ్యూలను సోమవారం (09.11.26) ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించి మెరిట్ జాబితా ఆధారంగా ప్రకటిస్తామని ప్రిన్సిపాల్ హనుమంతరావు స్పష్టం చేశారు.