నిర్మల్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ విధులు నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు. ట్రైనీ డీఎస్పీలతో కలిసి ప్రధాన రహదారులు, కూడళ్లు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.
బస్టాండ్ పరిసరాల్లో ఆటోల నిలుపుదల, అక్రమ పార్కింగ్, రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల ఏర్పడుతున్న సమస్యలను పరిశీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్లు, మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో సిబ్బంది అందుబాటులో ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, టౌన్ సీఐ సమ్మయ్య, ఎస్‌ఐ సిద్ధార్థ, ఆర్‌ఎస్‌ఐ రవికుమార్, పోలీసు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.