!గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము
**గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము**
**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**
మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామంలో కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సామన్నగారి రాము ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను వింటున్నారు.తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని రాము హామీ ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాముకు మద్దతుగా ఎంపీటీసీ సభ్యులు, నంద్యాల జిల్లా ట్రెజరర్ మహబూబ్ బాషా, టిడిపి గ్రామ అధ్యక్షుడు శమివుల్ల, కేవీ మధు, కాల్వ బుగ్గ చైర్మన్ కాటినేని నారాయణ, కొంతలపాడు సుధాకర్,పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.