BREAKING
ఐసీఎంఆర్ సంపద సర్వే.. వివిధ వయసు వర్గాల్లో తగ్గిన రక్తహీనత గంగవరంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభం కోబాల్ట్ ఎగుమతులపై కాంగో మరోసారి నిషేధం పంచాయతీ సీజన్ 5 ట్రైలర్ విడుదల.. ఫులేరాలో మారిన అధికారం, కొత్త డ్రామా గత వారం పతనంతో షేర్లలో కొనుగోలు అవకాశం కార్యకర్తలకు అండగా ఉంటాం..మల్లాంలోనే ఉంటాం..శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం! అన్నను కోల్పోయిన బాధ వర్ణనాతీతం..కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి)స్పష్టీకరణ అందం అంటే పుట్టుకతో వచ్చేదా లేక మనమే మలుచుకునేదా.. సద్గురుతో తమన్నా ఆసక్తికర చర్చ కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లులో అభివృద్ధి పరుగులు! చైనా-ఈయూ అధికారుల మారకపు రేట్ల చర్చలు చోర్ నికల్ కే భాగా 2 రిలీజ్ డేట్ ఖరారు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి డిసెంబర్ 17న !గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తజికిస్తాన్ వైదొలిగే నిర్ణయం.. 2027లో అమల్లోకి జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్*

వెల్దుర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలు

Select Suryaa Now
వెల్దుర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలు

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలను సోమవారం వెల్దుర్తి పట్టణంలోని శ్రీరాముల దేవాలయ ఆవరణంలో శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఉదయం సత్యసాయిబాబా భజన మందిరం వద్ద ఓంకారం, సుప్రభాత సేవ, నగర సంకీర్తన, మంగళహారతి నిర్వహించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు జరిపారు. మధ్యాహ్నం కీ.శే. గంట్ల మద్దయ్య, కీ.శే. గంట్ల యల్లమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు, శ్రీ సత్యసాయి హైస్కూల్ కరస్పాండెంట్ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన (విందు) కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం మహిళలచే ఊయల సేవ, తీర్థప్రసాద వితరణ జరిగాయి.  అలాగే జయంతోత్సవాలను పురస్కరించుకుని సేవా సమితి సభ్యులు స్థానిక ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు