BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం డిప్యూటీ మేయర్ గోపినాథ్‌కు బీజేపీ నాయకుల అభినందనలు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కలిసిన ప్రకాశం జిల్లా నూతన ZP చైర్మన్ కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం 5,000/- ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులను అందించిన........ పీపుల్స్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ అధ్యక్షులు గూడవల్లి గంగాధర్ జిల్లా న్యూక్లియర్ మెడికల్ అధికారి గా అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర నాయక్ శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్ థాయ్ లాండ్ అంబాసిడర్ చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌ను కోరిన‌ మంత్రి లోకేష్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల గిరిప్రదక్షిణకు నిర్మల్ డిపోనుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు : డిపోమేనేజర్ కల్పన. : రాయదుర్గం వైస్ చైర్మన్ ఏ వన్ మహబూబ్ భాషాకు ఘన సన్మానం!! పంచాయతీ ఎన్నికలు – రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కలినిన్‌గ్రాడ్‌కు సరఫరాల భద్రత కోసం కొత్త నౌకల నిర్మాణం కాళీ ఖేతీ రివ్యూ.. గ్రామీణ హారర్ డ్రామాతో భయపెట్టారా.. మెప్పించారా

కార్యకర్తలకు అండగా ఉంటాం..మల్లాంలోనే ఉంటాం..శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం! అన్నను కోల్పోయిన బాధ వర్ణనాతీతం..కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి)స్పష్టీకరణ

Select Suryaa Now
కార్యకర్తలకు అండగా ఉంటాం..మల్లాంలోనే ఉంటాం..శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం!  అన్నను కోల్పోయిన బాధ వర్ణనాతీతం..కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు  దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి)స్పష్టీకరణ

చిట్టమూరు మేజర్ న్యూస్

అన్నగా,ఆత్మీయుడిగా,కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న దువ్వూరు శేషు రెడ్డిని కోల్పోయిన బాధ వర్ణనాతీతమని,ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని సోదరులు దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి) భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు,అభిమానులు,కార్యకర్తలు అందించిన ఆప్యాయత,భరోసా ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. శేషురెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మల్లంలోనే ఉంటామని,ప్రతి కార్యకర్తకు,స్థానికులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాలుగు రోజులుగా తమను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ,రాజకీయేతర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం మల్లాంలో ఆయన స్థానికనాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.శేషు రెడ్డి మరణం తమ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చిందని,అన్నను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,రాష్ట్రస్థాయి నాయకులు పలువురు ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పడం తమకు మనోధైర్యాన్ని నింపిందన్నారు.అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీఅధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి,పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి,తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి,సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య,కామి రెడ్డి సత్యనారాయణరెడ్డి,గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య, బీజేపీ నాయకుడు,మాజీ ఎంపీ, ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు తదితరులు స్వయంగా వచ్చి 

పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఊరట నిచ్చిందన్నారు.ఇతర పార్టీలకు చెందిన పనబాక కృష్ణయ్యతో పాటు జిల్లా, నియోజకవర్గ,మండల స్థాయి నాయకులు,పలువురు ప్రముఖులు పార్టీలకతీతంగా తమను పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. శేషురెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన చేసిన సేవలను,పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావాన్ని ప్రస్తావించడం తమను భావోద్వేగానికి గురిచేసిందన్నారు.శేషు రెడ్డి ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో, నిజాయితీతో పనిచేశారని, అందుకే ఆయన అంత్యక్రియలకు వేలాదిమంది అభిమానులు,కార్యకర్తలు తరలి వచ్చారన్నారు. ఇంటి నుంచి శ్మశానం వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు చూపిన అభిమానం ఆయన ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమన్నారు.

*కార్యకర్తలు ఆందోళన చెందవద్దు.. మేమున్నాం!*

శేషురెడ్డి మరణంతో ఆయన కుటుంబం మల్లాం విడిచి వెళ్లిపోతుందని,ఇక కార్యకర్తలకు అండగా ఉండేవారు ఎవరూ ఉండరనే ప్రచారాలు తమ దృష్టికి వచ్చాయన్న కస్తూరి రెడ్డి అలాంటి ప్రచారాల వల్ల కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తాము మల్లాంలోనే 

ఉంటామని,శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన మార్గం లోనే రాజకీయంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. కార్యకర్తలను,నాయకులను మధ్యలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని,ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా,ఏ సమయంలో అవసరం వచ్చినా తమను సంప్రదించ వచ్చని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.శేషు రెడ్డి తమ మధ్య లేకపోయినా ఆయనతో అనుబంధం కలిగిన ప్రతి కార్యకర్త తమ కుటుంబ సభ్యుడేనని,వారిని ఆదరించి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.తమపై, శేషు రెడ్డిపై అభిమానంతో ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని,ఎవరూ అపోహలకు గురికావద్దని,పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని దువ్వూరు రామ రాఘవరెడ్డి స్పష్టం చేశారు.అంతకుముందు స్థానిక నాయకులు,కార్యకర్తలు,శేషురెడ్డి అభిమానులు,స్థానికులు పలువురు 

శేషురెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

*శేషు రెడ్డి లేరని తక్కువ అంచనా వేయొద్దు.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా మాకుంది:చెన్నారెడ్డి బాబురెడ్డి ఘాటు వ్యాఖ్యలు*

శేషురెడ్డి మరణం వైఎస్సార్‌సీపీ కుటుంబానికి తీరని క్షోభను మిగిల్చిందని,మాట ఇస్తే తప్పని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం ఆయన సొంతమని వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి బాబురెడ్డి అన్నారు.శేషు రెడ్డి వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఆయన కుటుంబ సభ్యులు అండగా ఉంటారని స్పష్టం చేశారు.శేషురెడ్డి కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోతుందని,ఇక మల్లాంలో తమకు ఎదురులేదని కొందరు ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.ఇలాంటి ప్రచారాలతో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చేతగానితన మని ఘాటుగా వ్యాఖ్యానించారు.తమ ఇంటి కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోలేని వారు ఇతర కుటుంబాల గురించి మాట్లాడే స్థాయి లేదని విమర్శించారు. పార్టీలకతీతంగా కొనసాగుతున్న స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం,భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం,స్వామి భక్తులు మర్చిపోలేరన్నారు.రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగానే తేల్చుకోవాలని,అంతేకానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇతరులను ఇబ్బందులకు గురిచేయాలని చూడటం చేతకానితనమని మండిపడ్డారు.ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, అధికారాన్ని ఉపయోగించి ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా,రాజకీయంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.శేషు రెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి కార్యకర్త,నాయకుడు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

*శేషురెడ్డి కుటుంబం ఊరు విడిచి వెళ్లదు.. ప్రచారాలు మానుకోవాలి:చిల్లకూరు కోదండరామిరెడ్డి హెచ్చరిక*

శేషురెడ్డి కుటుంబం మల్లాం విడిచి వెళ్లిపోతుందని,ఇక వైయస్సార్సీపి కార్యకర్తలకు ఎవరూ అండగా ఉండరని కొందరు చేస్తున్న ప్రచారాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి తప్పుబట్టారు.ఎన్ని కష్టాలు వచ్చినా శేషు రెడ్డి కుటుంబం మల్లాంలోనే ఉంటుందని,ప్రతి కార్యకర్తకు,నాయకుడికి అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.శేషు రెడ్డి కుటుంబంతో పాటు తాము కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని,ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వెన్నంటి నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఒక నాయకుడి మరణాన్ని ఆసరాగా చేసుకొని ఆయన కుటుంబం, అభిమానులు,కార్యకర్తలమనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రచారాలు చేయడం తగదన్నారు.వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవారు తమ తీరు మార్చు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు సుబ్రహ్మణ్యం రెడ్డి,చిల్లకూరు సాయిబాబా రెడ్డి,రాధాకృష్ణయ్య, పనబాక శ్రావణి,మల్లాం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు,దువ్వూరు కుటుంబం అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్