BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

రాయదుర్గం వైస్ చైర్మన్ ఏ వన్ మహబూబ్ భాషాకు ఘన సన్మానం!!

Select Suryaa Now
రాయదుర్గం వైస్ చైర్మన్ ఏ వన్ మహబూబ్ భాషాకు ఘన సన్మానం!!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్: 

రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఏ వన్ మహబూబ్ భాషాకు ఏ వన్ మొబైల్ షాప్ సిబ్బంది, స్నేహితులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి, పూలమాలలతో సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రాయదుర్గం అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుకున్నారు.

గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : మహబూబ్ భాషా

ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఏ వన్ మహబూబ్ భాషా మాట్లాడుతూ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు, నా కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు,అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తానని, ఎవరైనా, ఎప్పుడైనా నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు. చైర్మన్ టంకశాల హనుమంతు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల సహకారంతో రాయదుర్గం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.