BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

థాయ్ లాండ్ అంబాసిడర్ చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌ను కోరిన‌ మంత్రి లోకేష్

Select Suryaa Now
థాయ్ లాండ్ అంబాసిడర్ చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌ను కోరిన‌ మంత్రి లోకేష్

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

 భారతదేశంలోని థాయ్ లాండ్ రాయబారి శ్రీమతి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్ తో (Ms. Chavanart Thangsumphant) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో బుద్ధిస్ట్ హెరిటేజ్, ఎయిర్ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరారు. బీహార్‌లోని బోధ్‌గయ తరహాలో థాయ్ బౌద్ధ సన్యాసులు, యాత్రికుల కోసం ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలి. అమరావతిలోని మహాచైత్య స్థూపాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండ ప్రాంతాలను ఈ సర్క్యూట్‌లో చేర్చాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, థాయ్‌లాండ్ ప్రతిపాదించిన మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థలతో అనుసంధానించాలని కోరారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జున పేరు మీద బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని థాయ్ లాండ్ యూనివర్సిటీలు, బౌద్ధ సంస్థలకు ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. విశాఖపట్నం-థాయ్‌లాండ్ మధ్య క్రూయిజ్ పర్యాటకం, తీరప్రాంత పర్యాటకాన్ని బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (TICA), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మధ్య సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్ స్పందిస్తూ.. భారత్, థాయ్‌లాండ్ దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి. ఆసియాన్ దేశాలతో భారత్ జరిపే మొత్తం వాణిజ్యంలో థాయ్‌లాండ్ వాటా 16.7 శాతంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.