BREAKING
నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

Select Suryaa Now
వైభవంగా పలమనేరు పురపాలక పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

పలమనేరు పట్టణంలో పురపాలక సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు  అమరనాథ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బజారు వీధి, గంగమ్మ గుడి వీధుల మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీకి తోడు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో నూతన కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం చేయగా, వారితో పాటు నూతన కౌన్సిల్ సభ్యులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజల హర్షధ్వానాలతో మార్మోగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించాలని నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పాలన కొనసాగుతోందని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన పురపాలక పాలకవర్గం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులను మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం పలమనేరు పట్టణంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి బాటలు వేస్తుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి , పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జి సూర్య దినపత్రిక