BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు

సూర్య - మానకొండూర్ : మానకొండూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ముక్కెర సతీష్ కుమార్ 34వ జన్మదిన వేడుకలను మంగళవారం మండలంలోని గంగిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. 'ముక్కెర సతీష్ కుమార్ యువసేన' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సతీష్ కుమార్‌తో కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తాళ్లపల్లి సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. యువ నాయకుడు సతీష్ కుమార్ నిత్యం ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా, సామాజికంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముక్కెర సాయి, ముంజ శ్రీధర్, గంగిపల్లి శ్రీనివాస్, పిట్టల ఆంజనేయులు, పిట్టల అశోక్, భూమా అజయ్, సాగర్, ఆకుల మహేష్, మణికంఠతో పాటు మడేల్ యూత్ సభ్యులు, సతీష్ కుమార్ మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.