BREAKING
కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కార్తీక పౌర్ణమి వేళ విషాదం-గోదావరిలో బాలుడు మృతి

కార్తీక పౌర్ణమి వేళ విషాదం-గోదావరిలో బాలుడు మృతి

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేళ విషాదం-గోదావరిలో బాలుడు మృతి

మహాదేవపూర్ , మేజర్ న్యూస్, కార్తీక పౌర్ణమి పర్వదినం వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో విషాదం చోటుచేసుకుంది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలకు వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో జారిపడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్‌కు చెందిన రౌహ్నత్ సాహు (14) కార్తీక పౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనార్థం కాళేశ్వరానికి వచ్చాడు. ఈ క్రమంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి లోతైన ప్రాంతంలోకి వెళ్లి గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక జాలర్ల సహాయంతో నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. పండుగ పూట బాలుడు మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్ : ప్రకాష్ ,మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా