BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

Select Suryaa Now
క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు

విజయవాడ, మేజర్ న్యూస్: యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్‌లో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కోలా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొని క్రైస్తవ సమాజ సమస్యలపై చర్చించారు. పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం, ప్రార్థనా మందిరాలపై దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక న్యాయ కమిటీ ఏర్పాటు, ప్రతి జిల్లాలో న్యాయ సహాయ విభాగం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలాగే యువత, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, పేదలకు విద్యా, వైద్య సహాయం అందించడం, జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించే క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలకు ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించనున్నట్లు డాక్టర్ కోలా ప్రసాద్ తెలిపారు. సమాజ ఐక్యత, శ్రేయస్సు, పరస్పర సహకారమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.