BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన

Select Suryaa Now
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన

మచిలీపట్నం, మేజర్ న్యూస్: ఇటీవల సంభవించిన అర్ణబ్ తుఫాను ప్రభావంతో జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రాంగణం, కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో నేలకొరిగిన ఏడు భారీ వృక్షాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి అదే ప్రదేశాల్లో పునఃస్థాపించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. తుఫాను కారణంగా నేలకొరిగిన వృక్షాలను తొలగించకుండా, వాటిని సంరక్షిస్తూ తిరిగి నాటేందుకు ప్రత్యేక యంత్ర పరికరాలను వినియోగించారు. వృక్షాలను తిరిగి నాటేందుకు అవసరమైన గుంతలను ప్రొక్లెయినర్ సహాయంతో తవ్వగా, భారీ వృక్షాలను క్రేన్ ద్వారా జాగ్రత్తగా పైకి లేపి తిరిగి నిలబెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో మూడు భారీ వృక్షాలను, కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో మరో నాలుగు వృక్షాలను మొత్తం ఏడు వృక్షాలను విజయవంతంగా పునఃస్థాపించారు. సహజ విపత్తుల సమయంలో నేలకొరిగిన భారీ వృక్షాలను సాధ్యమైనంత వరకు తొలగించకుండా శాస్త్రీయ పద్ధతుల్లో తిరిగి నాటడం ద్వారా పచ్చదనాన్ని కాపాడుకోవచ్చని ఈ కార్యక్రమం ద్వారా అధికారులు చాటిచెప్పారు. వృక్ష సంపదను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.