BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Select Suryaa Now
ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

గీసుగొండ, మేజర్ న్యూస్, మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.దీపావళి మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమై ముగిసేంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధనలతో ఆలయాల్లో పూజలు నిర్వహిస్తు వస్తున్నారు.భక్తులు వేకువజామునే కార్తీక స్నానాలు ఆచరించి అక్కడికి వెళ్లి కాగడ హారతి,దీపారాధన పూజల్లో పాల్గొంటుండడంతో ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు.నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకట మాధవరావు దంపతులు, ఎన్పీడీసీఎల్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎస్.సి సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ సామ్య నాయక్ దంపతులు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు.కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గీసుగొండలోని బసవేశ్వర స్వామి,పంచముఖ ఆలయాల్లో కార్తీక మాస పూజలతో పాటు సామూహిక వ్రతాలు,దీపారాధన ఉత్సవాలు కొనసాగాయి.శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుకావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు.ఉదయం నుంచి శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు.మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేశారు.పలువురు నోములు నోచారు.వాయనాలు ఇచ్చారు.అదేవిధంగా,సంధ్య రాత్రివేళల్లో గౌరమ్మ పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు.

రిపోర్టర్ :విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా