BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ

Select Suryaa Now
10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: కనకదుర్గమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ మహిళ కుటుంబంతో కలిసి తిరుగు ప్రయాణంలో బస్‌స్టాండ్‌కు ఆటోలో వెళ్తుండగా తన బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయి దిగిపోయారు. విషయాన్ని గుర్తించిన వెంటనే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు సూచనల మేరకు కానిస్టేబుల్ రాజేష్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ చంద్రిక కృష్ణలంక పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్‌ను గుర్తించారు. ఆటో డ్రైవర్‌తో మాట్లాడి బ్యాగ్‌ను వెనక్కి రప్పించి బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. ఫిర్యాదు అందిన కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే బ్యాగ్‌ను గుర్తించి తిరిగి అందజేయడంపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఐపీఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణతో పాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.