BREAKING
తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం అయ్యప్ప స్వాముల బిక్షలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం

తాడిగడప, మేజర్ న్యూస్: తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కానూరు, పోరంకి ప్రాంతాల్లో విజయవాడ మున్సిపల్ చైర్మన్ వంగవీటి రాధాకృష్ణ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విస్తృతంగా పర్యటించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీతా గోపీచంద్‌తో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న 48 మంది అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్లతో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల పనులు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.150 కోట్లతో కృష్ణా నది జలాలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూ.50 కోట్లతో మట్టి రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు మరో రూ.50 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ పనులను ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.