తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
తొర్రూరు, మేజర్ న్యూస్, తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయ చర్యలు కింద రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆఫీస్ లో మార్క సాంబయ్య అధ్యక్షతన పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో మహబూబాబాద్ జిల్లా ఉన్న 18 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ఎంపిక చేశారని, అది శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చినటువంటి పంటలకు ఇచ్చిన బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని వారు కోరారు. ఎండిపోయిన పంటలకు వరి కి ఎకరానికి 30 వేల రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు మొదలుపెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని లేనియెడల రైతులందరికీ కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ తొర్రూర్ మండల కార్యదర్శి ఎండి యాకూబ్, సోమిరెడ్డి, జమ్ముల శ్రీను, దొనక దుర్గయ్య, బోర స్వామి బొల్లం మమత తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సురేందర్, తొర్రూరు, మహబూబాద్ జిల్లా